ట్విస్ట్.. శ్రీవిష్ణు డబుల్ ట్రీట్ కి బ్రేక్!?

Sree Vishnu

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ యువ హీరోస్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా మారిన హీరో శ్రీవిష్ణు కూడా ఒకరు. మరి శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాలు రెండూ ఒక్క రోజు గ్యాప్ లోనే ఈ ఫిబ్రవరి ఎండింగ్ లో రాబోతున్నాయి. దర్శకుడు హుస్సేన్ సాహ్ కిరణ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం ‘మృత్యుంజయ్’ అలాగే దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన కామెడీ డ్రామా చిత్రం ‘విష్ణు విన్యాసం’ వరుసగా ఈ ఫిబ్రవరి 27, 28 తేదీలలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

దీనితో ఒక హీరోకి ఇలాంటి విడుదల చాలా రేర్ గా సెట్ అయ్యింది. ఇలా శ్రీవిష్ణు నుంచి డబుల్ ట్రీట్ ఉంటుంది అని చాలా మంది అనుకుంటే ఇక్కడ ట్విస్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాల్లో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఈ నెలాఖరున వస్తుందని సినీ వర్గాల్లో లేటెస్ట్ సమాచారం. మరి రెంటిలో ఏది వాయిదా పడుతుంది అని త్వరలోనే క్లారిటీ రానుంది. సో శ్రీవిష్ణు నుంచి వచ్చే థ్రిల్లర్ లేదా కామెడీ సినిమా మాత్రమే రావచ్చు.

Exit mobile version