కన్నడ స్టార్ హీరో యశ్ లీడ్ రోల్లో గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ‘ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘విరోధం పెట్టుకొని బతకలేవు.. పట్టుదల వదిలేయ్’ అంటూ యశ్ చెప్పే పవర్ఫుల్ డైలాగు ఈ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఇక ఈ సినిమాలో యశ్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఈ సినిమాలో తమ నటనతో అలరించనున్నారు. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉండేలా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ కథను తీర్చిదిద్దారు.
వైలెంట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో యశ్ ‘రాయా’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. టీజర్లో చూపించిన విజువల్స్ మరియు యశ్ మాస్ లుక్ సినిమా రేంజ్‌ను చెప్పకనే చెబుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
