దిల్‌సుఖ్‌నగర్‌లో ‘గోయాజ్’ 24వ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ప్రారంభం

GOYAZ Luxury Silver Jewelry

ప్రముఖ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్‌ ‘గోయాజ్’ (GOYAZ) తన 24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో శనివారం (ఫిబ్రవరి 21) లాంఛనంగా ప్రారంభించింది. వేములూరి రాజేంద్ర కుమార్, రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి సహా గోయాజ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న గోయాజ్.. వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ నూతన స్టోర్‌ను 1800 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దింది. ఆధునికత, సంప్రదాయం ఉట్టిపడేలా వైవిధ్యభరితమైన, ఆకర్షణీయమైన వెండి ఆభరణాల కలెక్షన్స్‌ను ఇక్కడ అందుబాటులో ఉంచింది.

స్టోర్ ప్రారంభం సందర్భంగా కస్టమర్ల కోసం మార్చి 15 వరకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. కనీసం రూ.10 వేల విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తే రూ.3,000 వోచర్‌.. అదే రూ. లక్ష విలువైన కొనుగోళ్లపై ఏకంగా రూ.30,000 వరకు ఉచిత గిఫ్ట్ వోచర్లను అందిస్తున్నట్లు తెలిపింది. (రూ. 25,000 కొనుగోలుపై రూ.7,500; రూ. 50,000 కొనుగోలుపై రూ.15,000 వోచర్లు లభ్యం). త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో తమ శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గోయాజ్ యాజమాన్యం వెల్లడించింది.

Exit mobile version