మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే “సంబరాల ఏటి గట్టు”. బ్రో సినిమా తర్వాత తాను హీరోగా చేస్తున్న హై బడ్జెట్ యాక్షన్ చిత్రమిది. అయితే ఈ సినిమాని కొత్త దర్శకుడు రోహిత్ కే పి తెరకెక్కిస్తున్న ఈ సినిమా గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సింది కానీ ఆగింది. ఇలా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఓ భారీ సెట్టింగ్ లో గ్రాండ్ క్లైమాక్స్ పోర్షన్ ని మేకర్స్ ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు.
ఇక అందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని వీడియో క్లిప్ లు అలాగే ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇది వరకే వచ్చిన గ్లింప్స్ లో కొన్ని విజువల్స్ ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసాయి. ఇప్పుడు క్లైమాక్స్ కోసం చేస్తున్న ప్లాన్ చూస్తుంటే థియేటర్స్ లో ఈ క్లైమాక్స్ పార్ట్ తో ఎగ్జైట్ చేసేలానే ఉన్నారనిపిస్తుంది. సో ఈ అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
