మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా బ్లాక్ బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ అందించిన జోష్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. తన కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీని దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడొక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
తనదైన శైలిలో స్పీచ్‌లు ఇచ్చే ఫైర్‌బ్రాండ్ నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఇదే నిజమైతే, బండ్లన్న ఎనర్జీ మెగాస్టార్ సినిమాకు అదనపు క్రేజ్‌ను తీసుకురావడం ఖాయం. అలాగే, ఈ చిత్రంలో చిరంజీవి భార్యగా ప్రియమణి, కూతురిగా మలయాళ ముద్దుగుమ్మ అనశ్వర రాజన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాను సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి బండ్ల గణేష్‌కు ఈ సినిమాలో ఎలాంటి రోల్ పడుతుందో చూడాలి.
