సినిమా లీక్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు: ‘విష్ణు విన్యాసం’ సక్సెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు సంచలన వ్యాఖ్యలు

Sree Vishnu

ఫిబ్రవరి 27న థియేటర్లలోకి వచ్చిన శ్రీవిష్ణు (Sree Vishnu) లేటెస్ట్ మూవీ ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) వెనుక పెద్ద సైబర్ క్రైమ్ జరిగిందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సినిమాకు ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, శనివారం నాటికి కలెక్షన్స్ పుంజుకోవడంతో చిత్ర యూనిట్ తాజాగా ‘సక్సెస్ మీట్’ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ సినిమా రిలీజ్ కు ముందు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు.

“మా ‘విష్ణు విన్యాసం’ సినిమా ఫుటేజ్ లీక్ అయింది. అప్పట్నుంచి హ్యాకర్స్ మమ్మల్ని నిరంతరం బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారు. ఈ పైరసీ ముప్పు నుంచి తప్పించుకోవడానికి మాకు వేరే దారి కనిపించలేదు. అందుకే షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేసి, వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ కష్ట సమయంలో నా నిర్మాతలకు అండగా నిలబడ్డాను, వారి కోసం నేను చేయగలిగిందంతా చేశాను” అని శ్రీవిష్ణు ఎమోషనల్ అయ్యారు.

నిన్న ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు, సెకండాఫ్ కాస్త సాగదీసినట్లు ఉందని, కొన్ని సీన్స్ చాలా హడావిడిగా తీసినట్లు ఉన్నాయని రివ్యూవర్స్, ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. శ్రీవిష్ణు ఇప్పుడు చెప్పిన ‘లీక్’ విషయాన్ని బట్టి చూస్తే, ఆ హడావిడికి కారణం ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. టాలీవుడ్ (Tollywood) కు ఇలాంటి లీక్స్ కొత్తేమీ కాదు. గతంలో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ లాంటి సినిమాలు కూడా రిలీజ్ కు ముందే లీక్ అయ్యి తీవ్ర కలకలం రేపాయి. అయితే, కంటెంట్ బాగుండటంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడ్డాయి. ఇప్పుడు ‘విష్ణు విన్యాసం’ టీమ్ కూడా ఆ పైరసీ భూతాన్ని ఎదుర్కొని, తమ బడ్జెట్ ను, నిర్మాతలను సేవ్ చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

Exit mobile version