టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఇటీవల ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వీరి పెళ్లి ముచ్చట్లే వినిపిస్తుండగా, తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ నుండి చిత్ర యూనిట్ ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలోని ‘ఏందయ్య సామీ’ అనే సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాట కొత్తగా పెళ్లయిన జంట మధ్య ఉండే అనురాగాన్ని, ఒకరి ప్రపంచంలో మరొకరు పరవశించిపోయే తీరును అద్భుతంగా ఆవిష్కరించింది. నిజజీవితంలోనూ ఇప్పుడే వివాహం చేసుకున్న ఈ జంట, వెండితెరపై కూడా భార్యాభర్తలుగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.. ఈ అందమైన పాటను అజయ్-అతుల్ స్వరపరచగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శ్వేతా మోహన్ మరియు అజయ్ గోగవాలే తమ గాత్రంతో ఈ మెలోడీకి ప్రాణం పోశారు.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్ స్క్రీన్ జోడీగా మెప్పించిన విజయ్-రష్మిక, ‘రణబాలి’తో వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
