టీజర్ టాక్: మంచి ఫన్, హారర్ ఎలిమెంట్స్ తో ప్రామిసింగ్ గా ‘రాకాస’

rakasa

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ నే ‘రాకాస’. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ ఫన్ కం హారర్ థ్రిల్లర్ నుంచి మేకర్స్ ఇప్పుడు టీజర్ ని విడుదల చేశారు. ఇక ఈ టీజర్ మాత్రం ఒక స్యూర్ షాట్ ఫన్ హారర్ థ్రిల్లర్ ని ప్రామిస్ చేస్తుంది.

ఒక ఊరిలో సీరియస్ నోట్ తో మొదలైన ఈ టీజర్ లో కంటెంట్ తో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆశ్చర్యపరిచే రీతిలో ఉన్నాయని చెప్పవచ్చు. సెట్ వర్క్స్ కానీ విజువల్స్ ఎఫెక్ట్స్ ఇందులో మరింత ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇక వీటితో పాటుగా సంగీత్ శోభన్ ఎంటర్ అయ్యాక ఫన్ మోడ్ లోకి టీజర్ మారడం మంచి హారర్ ఎలిమెంట్స్ తో పాటుగా సూపర్ ఫన్ ని కూడా అందిస్తుంది అని అర్ధం అవుతుంది.

అలాగే తర్వాత రెండూ మిక్స్ చేసిన హారర్ కామెడీతో మరో ప్రామిసింగ్ సినిమా మన టాలీవుడ్ నుంచి రాబోతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా నిహారిక కొణిదెల మరియు జీ స్టూడియోస్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ తర్వాత నిహారిక తన బ్యానర్ లో మరో హిట్ కొట్టేలానే కనిపిస్తుంది. ఇక ఈ కామెడీ థ్రిల్లర్ ఈ ఏప్రిల్ 3న థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version