ఫోటో మూమెంట్: కొత్త పెళ్ళికొడుకు శిరీష్ తో ‘కొత్త జంట’ విజయ్, రష్మిక

alluarju

రీసెంట్ గానే మన టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన్నాలు పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. తమ పెళ్లి తర్వాత బయటకొచ్చి కొన్ని ఇతర పనుల్లో వారు కలిసి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేకమంది సినీ ప్రముఖుల్ని కూడా వారు కలుస్తుండగా లేటెస్ట్ గా వీరి తర్వాత పెళ్ళికి సిద్ధమైన మరో యంగ్ హీరో అల్లు శిరీష్ ని కలిసిన విజువల్స్ వైరల్ గా మారాయి.

పెళ్లి కొడుకుగా సిద్ధమైన కొత్త జంట హీరో శిరీష్ ని ఈ కొత్త జంట రష్మిక, విజయ్ లు కూడా ఒకే ఫ్రేమ్ లో యాడ్ అయ్యి మరింత నిండుతనం తీసుకొచ్చారు. అంతే కాకుండా ఇందులోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు తన భార్య అల్లు స్నేహా రెడ్డి కూడా కనిపించడం విశేషం. ఇలా ఈ మెమొరబుల్ మూమెంట్ అభిమానుల్లో ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఇక శిరీష్ వివాహం విషయానికి వస్తే.. తన పెళ్లి ఈ మార్చ్ 6న జరగనుండగా రేపు మార్చ్ 2న అల్లు స్టూడియోస్ లో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి.

Exit mobile version