NTR Neel: తారక్ కోసం ప్రత్యేక ఆయుధం?

JrNTR-Neel

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “డ్రాగన్” (పరిశీలనలో ఉన్న టైటిల్) కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఎన్టీఆర్ ని మాత్రం ప్రశాంత్ నీల్ ఊహించని లెవెల్లో ప్రెజెంట్ చేస్తుండగా చిన్న లీక్ కూడా తనపై బయటకి రానివ్వలేదు.

తారక్, నీల్ కాంబినేషన్ అంటే హైప్ ఎలా ఉంటుందో అందుకు తగ్గ అవుట్ పుట్ తోనే మేకర్స్ సిద్ధం చేస్తుండగా ఓ క్రేజీ రూమర్ ఇప్పుడు ఈ సినిమాపై ముఖ్యంగా ఎన్టీఆర్ విషయంలో వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేతిలో ఒక ప్రత్యేకమైన ఆయుధం ఉంటుందట. అంటే గతంలో తన సినిమాల్లో సింహాద్రి, సాంబ లాంటి వాటిలో కనిపించిన ఆయుధం లాంటిది నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ కోసం కూడా ఒకటి డిజైన్ చేయించినట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో కూడా రక్తపాతం భారీ స్థాయిలోనే ఉంటుంది అని టాక్ ఉంది. సో ఈ క్రేజీ టాక్ పై ఓ క్లారిటీ వస్తే సెట్ అవుతుంది.

Exit mobile version