హీరోయిన్ల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఆ మధ్య వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ వివాదంపై స్పందిస్తూ కీలక కామెంట్స్ చేశారు. ‘ఎస్.సరస్వతి’ సినిమాతో ఆమె డైరెక్టర్ గా మారారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కాబోతుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నటనతో పోలిస్తే దర్శకత్వం చాలా భిన్నమని, యాక్టింగ్ చేయాలంటే తన పాత్రపై దృష్టి పెడితే సరిపోతుందని, కానీ దర్శకత్వంలో మొత్తం సినిమాను చూసుకోవాల్సి వస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో నటీమణుల డ్రెస్సింగ్ పై వస్తున్న కామెంట్స్ గురించి కూడా ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మీకొక చెల్లి ఉంటే, ఆమె షార్ట్ వేసుకొని బయటికి వెళ్తే రేప్ చేయాలని మీకు అనిపిస్తుందా ?, మీరు లేడీస్ డ్రెస్సింగ్ని ఎలా బ్లేమ్ చేస్తారు?. మగాళ్లు జీన్స్ ప్యాంట్ వేసుకొని వంగితే మొత్తం కనిపిస్తుంది. దానిపై ఎవరూ ఎగబడట్లేదు కదా?. అబ్బాయిల విషయంలో ఒకలా, అమ్మాయిల విషయంలో ఇంకోలా ఎందుకు ఆలోచిస్తున్నారు?” అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపింది.
