చిరంజీవి ప్రస్థానం స్ఫూర్తిదాయకం – పవన్ కళ్యాణ్

Pawan Kalyan

మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో మరో గౌరవాన్ని అందుకోబోతున్నారు. తాజాగా గద్దర్‌ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవిని ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం వరించింది. కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తాజాగా ఒక పోస్ట్‌ పెడుతూ.. ఈ వార్త నాకెంతో సంతోషాన్నిచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’ అని పవన్ తెలిపారు.

తన పోస్ట్ లో పవన్ కళ్యాణ్ ఇంకా రాసుకొస్తూ.. ‘గద్దర్‌ అవార్డులకు ఎంపికైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’ అని తెలిపారు. ఇక నాగార్జున కూడా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. తన కుమారుడు నాగచైతన్యను ప్రత్యేకంగా అభినందించారు. చైతూ ఉత్తమ నటుడిగా ఎంపికైనందుకు ఎంతో ఆనందంగా ఉందని నాగార్జున చెప్పుకొచ్చారు. ‘తండేల్‌’ సినిమాలో అద్భుతంగా నటించాడని, ఈ అవార్డుకు అతడు అర్హుడని నాగ్ కొనియాడారు.

Exit mobile version