నా సినిమాని కావాలనే నెగిటివ్ చేశారు – శివాజీ

Sampradayini Suppini Suddap

నటుడు శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివాజీ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమా జనంలోకి వెళ్లడంతో సినిమా పై అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికితోడు ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. ఐతే, థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో, తన సినిమాపై కావాలనే కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని శివాజీ కామెంట్స్ చేశారు.

శివాజీ తన కామెంట్స్ లో ఏం మాట్లాడారు అంటే.. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమా పోయింది పోయింది’ అని ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రయత్నం చేశారు. నేను ఒక మంచి సినిమా తీశాను. కానీ, మీరు మిక్స్డ్ టాక్ అని మొదలుపెట్టారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. నా సినిమా బాగుందా ? లేదా ? అనేది డిసైడ్ చేయాల్సింది ప్రేక్షకులు. మొత్తానికి మీరైతే గెలిచార్రా అబ్బాయిలు’ అని శివాజీ తాను పోస్ట్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు.

Exit mobile version