నటుడు, రాజకీయ నాయకుడు విజయ్, త్రిష మధ్య ఇప్పుడు ఏం జరుగుతోంది ?, నిజంగానే వారిద్దరి మధ్య ప్రేమ ఉందా ?, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ?, తమిళ సినీ వార్తల్లో ఈ వార్తనే ఎక్కువగా కనిపిస్తోంది. ఎలాగూ, విజయ్ భార్య సంగీత కూడా విడాకులకు అప్లయ్ చేశారు. కాబట్టి, విజయ్ – త్రిష మధ్య ఏదో నడుస్తోంది అని అందరూ భావిస్తున్నారు. మరి త్రిష నుంచి అయితే, ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు.
సీనియర్ హీరోయిన్ గా త్రిష స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా, యంగ్ దర్శకుడు వశిష్ట కలయికలో వస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో కూడా నటిస్తోంది. పైగా, గత కొంతకాలంగా త్రిష పెళ్లి పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు 41 ఏళ్లు దాటిపోతున్నా త్రిష ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. ఈ నేపథ్యంలో త్రిష, స్టార్ హీరో విజయ్‌తో రిలేషన్లో ఉందనేది నిజమేనా ?, ఏది ఏమైనా తమ బంధంపై త్రిష-విజయ్ మరింత స్పష్టత ఇస్తే బాగుంటుంది.
