అల్లు అర్జున్ కోసం అట్లీ వెరైటీ టైటిల్..?

AA22

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘AA22’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న మరియు జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్‌ను ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ‘టైటిల్ గ్లింప్స్’ వీడియో ప్రేక్షకులను అబ్బురపరిచే విజువల్స్‌తో, అల్లు అర్జున్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్లలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అట్లీ తనదైన శైలిలో భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఒక భారీ ప్రపంచాన్ని ఈ సినిమా కోసం సృష్టించారని చిత్ర వర్గాల టాక్.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ టైటిల్ వెల్లడి కార్యక్రమానికి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. సున్ పిక్చర్స్ బ్యానర్‌పై దాదాపు ₹700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానుంది. 2027లో విడుదల కానున్న అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా ‘AA22’ నిలవనుంది.

Exit mobile version