‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కోసం వేట కొనసాగింపు.. ఫ్యాన్స్ కోరిక తీరేనా!

peddi 4

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. ఒక మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా పట్ల అభిమానుల్లో విపరీతమైన బజ్ ఉంది. అలాగే వచ్చిన రెండు సాంగ్స్ కూడా సూపర్ హిట్ కావడంతో నెక్స్ట్ సాంగ్ పట్ల మరింత ఆసక్తి నెలకొంది.

అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ కోసం పెర్ఫామ్ చేసే ఆ బ్యూటీ ఎవరు అనే వేటే ఇంకా కొనసాగుతుందట. బుచ్చిబాబు ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు అని తెలుస్తుంది.

కానీ ఫ్యాన్స్ మాత్రం అయితే మృణాల్ ఠాకూర్ లేదా ఆయేషా ఖాన్ ఇద్దరి విషయంలో ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి వీరిలో ఎవరు వస్తారో లేదా కొత్తగా ఎవరినైనా బుచ్చిబాబు ట్రై చేస్తాడా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 30న సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

Exit mobile version