సంగీత ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌కు హైదరాబాద్ ముస్తాబైంది. తన సంగీత ప్రయాణంలో 15 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘XV – 15 ఇయర్స్ విత్ యూ’ పేరుతో శనివారం (మార్చి 21) గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో భారీ మ్యూజిక్ షో ప్లాన్ చేశారు. ఓషన్ వైబ్స్, బ్రాండ్ అవతార్, ట్రైబ్ వైబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌కు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు పక్కా ప్లాన్ తో పార్కింగ్, ఎంట్రీ రూల్స్ ప్రకటించారు.
టైమింగ్స్ ఇవే..
అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శనివారం సాయంత్రం 4:30 గంటలకే స్టేడియం గేట్లు తెరుస్తారు. కచ్చితంగా సాయంత్రం 6:00 గంటలకు అనిరుధ్ లైవ్ షో దద్దరిల్లడం మొదలవుతుంది. కాబట్టి ఆఖరి నిమిషంలో హడావిడి పడకుండా కాస్త ముందే చేరుకోవడం ఉత్తమం.
ఎవరికి ఎక్కడ పార్కింగ్?
టికెట్ కేటగిరీని బట్టి వేర్వేరు పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. సిల్వర్, గోల్డ్ టికెట్లు ఉన్నవారు బోల్డర్ హిల్స్‌లో తమ వాహనాలను నిలపాలి. కార్లతో పాటు బైక్ పార్కింగ్ ఇక్కడ మాత్రమే ఉంటుంది. గేట్ 1, గేట్ 4 ద్వారా వీరికి ఎంట్రీ కల్పిస్తున్నారు. ఇక ఫ్యాన్ పిట్ టికెట్ హోల్డర్లకు సంధ్యా కన్వెన్షన్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం కార్లకు మాత్రమే అనుమతి. ఈ రెండు చోట్ల నుంచి స్టేడియానికి చేరుకోవడానికి పరిమిత సంఖ్యలో షటిల్ బస్సులను నడుపుతున్నారు. ఈ షటిల్ సర్వీస్ రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇక రాక్‌స్టార్ ఫ్యాన్ పిట్ టికెట్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా గచ్చిబౌలి స్టేడియం ఆవరణలోనే పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఇవన్నీ ముందు వచ్చిన వారికి ముందు అనే (ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్) పద్ధతిలోనే కేటాయిస్తారు.
ఆప్షన్స్ చూసుకుంటే బెటర్
స్టేడియం గేట్ దగ్గరే క్యాబ్ డ్రాప్, పికప్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. వీకెండ్ కావడంతో పాటు కాన్సర్ట్ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ లో ఇరుక్కుపోకుండా ఉండాలంటే సొంత వాహనాల కంటే క్యాబ్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా స్నేహితులతో కలిసి కార్‌పూలింగ్ ద్వారా రావడం చాలా బెటర్ అని నిర్వాహకులు సూచిస్తున్నారు. కాస్త పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ వీకెండ్ అనిరుధ్ మ్యూజిక్ తో ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు.
లొకేషన్ మ్యాప్స్ మీకోసం (Quick Navigation):
బోల్డర్ హిల్స్ పార్కింగ్ (గేట్ 1 ఎంట్రీ): ఇక్కడ క్లిక్ చేయండి
బోల్డర్ హిల్స్ పార్కింగ్ (గేట్ 4 ఎంట్రీ): ఇక్కడ క్లిక్ చేయండి
సంధ్యా కన్వెన్షన్ పార్కింగ్ (ఫ్యాన్ పిట్ కోసం): ఇక్కడ క్లిక్ చేయండి
గచ్చిబౌలి స్టేడియం పార్కింగ్ (రాక్‌స్టార్ ఫ్యాన్ పిట్ కోసం): ఇక్కడ క్లిక్ చేయండి
క్యాబ్ డ్రాప్ & పికప్ పాయింట్: ఇక్కడ క్లిక్ చేయండి
