పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఉగాది హిట్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం సాలిడ్ బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. ఇలా బుక్ మై షోలో ఇది వరకే వరుసగా మూడు రోజుల్లో గట్టి బుకింగ్స్ ని నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ తర్వాత డే 2 కూడా మంచి బుకింగ్స్ నమోదు చేసింది. .
ఉగాది హాలిడే తర్వాత వర్కింగ్ డే లో ఈ సినిమా 1 లక్ష 40 వేల దగ్గరకు టికెట్ సేల్స్ చేసుకుంది. ఇలా ఓవరాల్ గా కేవలం ఈ కొన్ని రోజుల లోనే మొత్తం 8 లక్షల 50 వేలకి పైగా టికెట్స్ ఒక్క బుక్ మై షో నుంచే ఈ సినిమాకి తెగాయి. సో ఇవాళ్టితో ఈ సినిమాకి 1 మిలియన్ టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
