ప్రస్తుతం రికార్డులతో మాస్ జాతర చేస్తున్న సెన్సేషనల్ హిట్ చిత్రమే ధురంధర్ 2. రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ డ్రామా ఆడియెన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రతీ ఒక్క నటుడు కూడా తమదైన శైలిలో ఇమిడిపోయారు.
అలా ఇండియన్ నటులు అయినప్పటికీ పాకిస్తానీయులుగా కనిపించి మెస్మరైజ్ చేశారు. అలా పార్ట్ 1 లో అక్షయే ఖన్నా దుమ్ము లేపితే పార్ట్ 2 లో అర్జున్ రాంపాల్ ఆ బాధ్యత తీసుకున్నారు. అర్జున్ కరుడుగట్టిన తీవ్రవాద పాత్రలో క్లైమాక్స్ లో భారత్ పై దూసిస్తూ చెప్పిన డైలాగులు కూడా థియేటర్స్ లో ఆడియెన్స్ ని రగిలించాయి.
అయితే అలా తను సినిమాలో భారతదేశాన్ని దూసిస్తూ కామెంట్స్ చేసినందుకు క్షమాపణ చెబుతున్నాను అని అర్జున్ ఇటీవల తెలిపిన స్టేట్మెంట్ బయటకి వచ్చింది. తన గుండె లోతులో నుంచే దేశం పట్ల భక్తి ఉందని కానీ సినిమాలో తిట్టినందుకు అందరికీ క్షమాపణ చెబుతున్నాను అని బిగ్ స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు ఫ్యాన్స్ లో చర్చగా మారింది.
