అఫీషియల్: మోహన్ లాల్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ కి కొత్త డేట్ వచ్చేసింది!

Drishyam 2

సాలిడ్ థ్రిల్లర్ చిత్రాలకు మలయాళ సినిమా పెట్టింది పేరు. ఒకదాన్ని మించి ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో వారు ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అలా మలయాళ సినిమా నుంచి వచ్చిన ఓ ట్రెండ్ సెట్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే దృశ్యం. మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమాకి మూడో భాగం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

అయితే ఫైనల్ గా పార్ట్ 3 ని ఈ ఏప్రిల్ 3కి ప్లాన్ చేశారు కానీ గల్ఫ్ దేశాల్లో పరిస్థితిలు బాగోని కారణంగా వాయిదా పడవచ్చు అనే టాక్ నే వినిపించింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా కొత్త డేట్ ని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 10న ఈ సినిమా రానున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ తో ప్రకటించారు. సో ఈ క్రేజీ థ్రిల్లర్ కి ఫైనల్ గా అప్పుడు తెర పడనుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాకి అనీల్ జాన్సన్ సంగీతం అందిస్తున్నారు అలాగే ఆంటోనీ పేరంబవూర్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version