హిస్టరీ క్రియేట్ చేసిన ‘ధురంధర్ 2’.. సెకండ్ ఫ్రైడే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట!

Dhurandhar

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ : ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. రెండో శుక్రవారం నాడు ఈ సినిమా ఏకంగా రూ.38 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ఆల్-టైమ్ రికార్డును సృష్టించింది. గురువారం శ్రీరామనవమి సెలవు దినం కావడంతో వసూళ్లు బాగున్నప్పటికీ, మరుసటి రోజు శుక్రవారం కూడా కలెక్షన్లలో పెద్దగా తగ్గుదల కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ సినిమా సాధించిన మరో విశేషం ఏమిటంటే, బాలీవుడ్ చరిత్రలో రెండో శుక్రవారం అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి రెండు స్థానాల్లో ‘ధురంధర్’ ఫ్రాంచైజీ చిత్రాలే ఉండటం. గతంలో ‘ధురంధర్: పార్ట్ 1’ రూ.35 కోట్లతో టాప్‌లో ఉండగా, ఇప్పుడు పార్ట్ 2 ఆ రికార్డును అధిగమించింది. ప్రేక్షకులు ఈ సిరీస్‌ను ఎంతగా ఆదరిస్తున్నారో ఈ వసూళ్లే నిదర్శనం. ప్రస్తుతం అందుతున్న లెక్కలు ప్రాథమిక అంచనాలు మాత్రమే కాబట్టి, అసలు గణాంకాలు ఇంకా ఎక్కువగా ఉండవచ్చు.

రెండో వీకెండ్‌లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తోంది. శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ మరియు ఆక్యుపెన్సీలో మంచి గ్రోత్ కనిపిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా, లాంగ్ రన్ లో మరిన్ని బెంచ్‌ మార్కులను సెట్ చేసే దిశగా దూసుకుపోతోంది.

Exit mobile version