విషాదం: టాలెంటెడ్ టాలీవుడ్ ఎడిటర్ కన్నుమూత!

madhukar

ఒక సినిమా చూసే ఆడియెన్ కి ఎలా అనిపించాలి అనేది ఖచ్చితంగా అవుట్ పుట్ ని ప్రెజెంట్ చేయడంలోనే ఉంటుంది. అయితే దానికి దర్శకుని విజన్ తో పాటుగా ఎడిటర్ పనితనం కూడా ఎంతో కీలకం. మరి అలా మన తెలుగు సినిమా దగ్గర తనదైన ఎడిటింగ్ తో వందలాది సినిమాలకి ట్రైలర్ కట్స్ అందించి పలు సినిమాలకి ఫుల్ లెంగ్త్ ఎడిటర్ గా పని చేసిన యువ ఎడిటర్ మధు రెడ్డి ఇప్పుడు కన్ను మూశారన్న వార్త తెలుగు సినిమా దగ్గర విషాదంగా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా ట్రైలర్ కట్ నుంచి ఆహానా పెళ్ళంట, దక్ష, దళం వంటి సినిమాలకి ఎడిటింగ్ అందించిన మధుకర్ రెడ్డి యుక్త వయస్సులోనే గుండె పోటుతో మరణించడం అనేది తీవ్ర విషాదంగా మారింది. మణికొండలో నిన్న ఏప్రిల్ 18న ఆకస్మిక గుండెపోటు కారణంగా కన్ను మూశారట. అయితే కరీంనగర్ కి చెందిన మధుకర్ హైదరాబాద్ వచ్చి సినిమా పట్ల ఫ్యాషన్ తో ఎంతో క్రియేటివ్ గా వర్క్ అందించారు. అలాంటిది తాను ఇంత చిన్న వయసులోనే కాలం చేయడం అనేది తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

Exit mobile version