‘వారణాసి’ అక్కడి భారీ షెడ్యూల్ ఆగలేదా!

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ప్రస్తుత గ్లోబల్ సెన్సేషన్ సినిమానే “వారణాసి”. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి అంటార్కిటాలో ఓ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ అది పలు కారణాలు రీత్యా మరో ప్లానింగ్ లోకి మారినట్టు రూమర్స్ వచ్చాయి. అంతే కాకుండా దేవర సెట్స్ లోనే ఈ షెడ్యూల్ షూట్ కూడా చేసినట్టు బజ్ వినిపించింది. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ క్రేజీ షెడ్యూల్ ఇంకా ఆన్ లోనే ఉందని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ షూట్ కూడా అతి త్వరలోనే మొదలు కానున్నట్టు సూచనలు వినిపిస్తున్నాయి.

సో విజువల్స్ పరంగా వారణాసి ఎక్కడా తగ్గకుండా రాబోతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 27న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Exit mobile version