నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన తాజా చిత్రం ‘మైసా’ కోసం ప్రాణాలకు తెగించి చేసిన సాహసం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఆమె గోండు తెగకు చెందిన మహిళగా నటిస్తుండగా, కేరళలోని అతిరపల్లి జలపాతం వద్ద సుమారు 80 అడుగుల ఎత్తు నుండి ఎటువంటి డూప్ లేకుండా దూకి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలైనప్పటికీ, లెక్కచేయకుండా షూటింగ్ పూర్తి చేయడం ఆమె డెడికేషన్‌కు నిదర్శనం.
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం రష్మిక బ్యాంకాక్‌లో అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ తీసుకుంది. రోజుకు ఎనిమిది గంటల పాటు మార్షల్ ఆర్ట్స్ మరియు గిరిజన పోరాట శైలులపై పట్టు సాధించింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఈ స్థాయిలో ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ చూపించడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రష్మిక కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎమోషన్స్‌తో పాటు మునుపెన్నడూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ‘మైసా’లో ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. తన పాత్ర కోసం రష్మిక పడుతున్న ఈ కష్టం వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
