ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ తన పొలిటికల్ పార్టీ టీవీకే తో తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం జన నాయగన్ థియేటర్స్ లో రాక ముందే తన పైనే సెటైరికల్ సినిమా అన్నట్టు కాంట్రవర్సీ రేపిన చిత్రమే ‘టి ఎన్ 2026’.
ప్రముఖ నటుడు నట్టి సుబ్రమణియన్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఉమాపతి రామయ్య తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ తోనే దుమారం రేపింది. ఇందులో సుబ్రమణియన్ దళపతి విజయ్ స్టైల్ లోనే నటించడం, తన స్పీచ్, మ్యానరిజాలు తరహాలోనే చేయడంతో విజయ్ అభిమానుల ఆగ్రహం ఈ సినిమా మేకర్స్ పై పడింది.
అయితే అలానే థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఊహించని విధంగా ఇంపాక్ట్ మాత్రం చూపించలేకపోయింది. ఇలా ఫైనల్ గా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా లాంటి పాపులర్ ఓటిటి లలో అందుబాటులో ఉంది. సో ఈ సెటైరికల్ చిత్రాన్ని చూడాలి అనుకుంటే వాటిలో చూడొచ్చు.
