ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న బ్లాక్ బస్టర్ ‘వాలా 2’.. కానీ!

రీసెంట్ గా మలయాళ సినిమా నుంచి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సావిన్ ఎస్ ఏ నుంచి వచ్చిన క్రేజీ సీక్వెల్ చిత్రం “వాలా 2” కూడా ఒకటి. బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫన్ తో చేసిన మొదటి సినిమా వాలా సూపర్ హిట్ అయ్యింది. అయితే దానికి పార్ట్ 2 గా కొత్త నటీనటులు హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, వినాయక్ వి, అజిన్ జాయ్ తదితరులతో ప్లాన్ చేసిన ఈ సినిమా దానికి మించి పెద్ద హిట్ అయ్యి భారీ వసూళ్లు సాధించింది.

అంతే కాకుండా తెలుగులో కూడా విడుదల అయ్యి మన దగ్గరా మంచి వసూళ్లు రాబట్టి ఆకట్టుకుంది. అయితే ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యిపోయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు పాపులర్ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నారు. ఇక లేటెస్ట్ గా వారు ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేసారు.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతానికి కేవలం మలయాళం వెర్షన్ లోనే వస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. డబ్బింగ్ వెర్షన్ లపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. సో ఇదీ ఒక క్లారిటీ వస్తే తెలుగు ఆడియెన్స్ కి కూడా గుడ్ న్యూస్ అయ్యి ఉండేది. మరి దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Exit mobile version