సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ

మన తెలుగు సినిమా నుంచి వచ్చిన పలు స్వీట్ క్లాసిక్ హిట్ చిత్రాల్లో ఆనందం సినిమా కోసం చాలా మందికి తెలిసే ఉంటుంది. జై ఆకాష్ హీరోగా రేఖ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఒక మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా హీరోయిన్ రేఖ ఈ మధ్యనే మళ్ళీ లైమ్ లైట్ లోకి రావడం మొదలు పెట్టింది.

కొన్నాళ్ల గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారిన రేఖ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో సెలెబ్స్ ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే రూల్స్ తనకి అవసరం లేదు అన్నట్టు క్లారిటీ ఇచ్చింది. రీల్స్, పోస్ట్ లలో సెలెబ్రెటీస్ ఎవరూ లైక్స్ చేయకూడదు కామెంట్స్ చేయకూడదు అని నాకు కొందరు చెప్పారు.

అలా చేస్తే తనకి ఫాలోవర్స్ రారు తన అకౌంట్ ని నమ్మరు ఫేక్ అనుకుంటారని వారు అంటున్నారని ఆమె తెలిపింది. అయితే ఇలాంటి రూల్స్ నాకు అవసరం లేదు నాకు ప్రపంచంతో మనుషులతో కనెక్ట్ అయ్యి ఉండడమే ఇష్టం. నేనూ మనిషినే కదా? ఈ రూల్ నేను పాటించాలా? అంటూ రేఖ ప్రశ్నించింది. దీనితో సోషల్ మీడియాలో ఈ రూల్ కోసం పోస్ట్ వైరల్ గా మారింది.

Exit mobile version