కన్నడ స్టార్ యష్ ‘టాక్సిక్’ సినిమాకు సంబంధించి కియారా అద్వానీ కోరిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో తనపై చిత్రీకరించిన కొన్ని ఇంటిమేట్ సీన్స్ చూశాక, అవి మరీ బోల్డ్‌గా ఉన్నాయని కియారా ఫీల్ అయినట్లు సమాచారం. దీంతో ఆ సీన్ల లెంగ్త్ తగ్గించాలని లేదా వాటిని ఎడిట్ చేయాలని ఆమె దర్శకురాలికి, యష్‌కి విన్నవించినట్లు తెలుస్తోంది.
షూటింగ్ సమయంలో దర్శకురాలు చెప్పిన దానికి, స్క్రీన్‌పై కనిపిస్తున్న దానికి తేడా ఉండటంతోనే కియారా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఈ సీక్వెన్స్‌లు తన ఇమేజ్‌పై ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతో ఆమె మేకర్స్‌ను రిక్వెస్ట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కియారా నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు షూటింగ్ అయిపోయాక ఇలా అడగడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, ఈ గాసిప్‌తో ‘టాక్సిక్’ సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది.
