‘డ్రాగన్’లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

NTR Neel

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్) పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ అనుకుంటున్నారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేయడానికి ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ఏ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తోందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట.

అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version