క్లైమాక్స్ యాక్షన్ పూర్తి చేసుకున్న ఆదర్శకుటుంబం !

Adarsha-Kutumbham

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం. 47′ (AK47)’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం, ఈ చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందని మేము వార్త అందించాము. తాజా సమాచారం ప్రకారం, చిత్ర బృందం క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసింది. అయితే, షూటింగ్‌కు సంబంధించిన మరికొన్ని భాగాలు ఇంకా మిగిలి ఉన్నాయట. మరి మొత్తం చిత్రీకరణ ఎప్పటికీ పూర్తవుతుందో చూడాలి.

అన్నట్టు నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. పైగా త్రివిక్రమ్‌ రచయితగా వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి. అందుకే, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మూవీని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా నిర్మాణ సంస్థ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Exit mobile version