వెండి తెరపై హిట్.. బుల్లితెరపై డిజాస్టర్.. శర్వా సంక్రాంతి సినిమాకి షాకింగ్ రేటింగ్

Nari Nari Naduma Murari

టాలీవుడ్ ఛార్మింగ్స్టార్ శర్వానంద్ హీరోగా సంయుక్త మీనన్ అలాగే సాక్షి వైద్య హీరోయిన్స్ గా దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన కామెడీ డ్రామానే నారీ నారీ నడుమ మురారి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం శర్వానంద్ కెరీర్ లో మరో సంక్రాంతి హిట్ గా వెండితెరపై నిలిచింది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ లో హిట్ గా చెప్పుకున్న ఈ సినిమాకి అదే ఫ్యామిలీ ఆడియెన్స్ బుల్లితెరపై షాకిచ్చారు.

ఇటీవల ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీలో మొదటిసారి ప్రసారంకి వచ్చింది. కానీ ఊహించని విధంగా ఈ చిత్రానికి డిజాస్టర్ రేటింగ్ నమోదు అయినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి కేవలం 1.59 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇది మాత్రం ఒక ప్లాప్ రేటింగ్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర లు నిర్మాణం వహించారు.

Exit mobile version