అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ జరిగిందా.. ఫోటోలతో క్లూ ఇచ్చిన బ్యూటీ..!

సోషల్ మీడియా సెలబ్రిటీ అషు రెడ్డి తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. మెడలో పూల దండలు, చేతికి ఉంగరం తో ఉన్న ఈ ఫోటోలు చూస్తుంటే ఆమెకు నిశ్చితార్థం జరిగినట్లు కనిపిస్తోంది. అయితే, ఆమె పక్కన ఉన్న వ్యక్తి ముఖాన్ని రివీల్ చేయకపోవడంతో ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనే చర్చ మొదలైంది.

గతంలో ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐని పెళ్లి పేరుతో మోసం చేసి, సుమారు రూ. 9 కోట్లు వసూలు చేసిందంటూ అషు రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉండగానే ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రావడం గమనార్హం. ఒకవేళ ఆమె నిశ్చితార్థం చేసుకున్నది సదరు ధర్మేంద్రతోనే అయితే, ఈ కేసు సద్దుమణిగే అవకాశం ఉంది.

రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన అషు, ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు ఈ చీటింగ్ కేసు మరియు నిశ్చితార్థం వార్తలు ఆమెను మరోసారి చర్చల్లోకి తెచ్చాయి. మరి ఈ ఫొటోలపై అషు రెడ్డి ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Exit mobile version