బోల్డ్ పోస్టర్ తో ‘రౌడీ జనార్ధన’ నుంచి విజయ్ దేవరకొండ!

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ అండ్ యాక్షన్ చిత్రమే ‘రౌడీ జనార్ధన’. ఈ సినిమా గ్లింప్స్ తోనే సాలిడ్ బజ్ ని సొంతం చేసుకోగా మేకర్స్ లేటెస్ట్ గా విజయ్ పుట్టినరోజు కానుకగా వదిలిన ఓ బోల్డ్ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

తుపాకీ పట్టుకొని వర్షంలో కూర్చున్న విజయ్ గుండెలపై తన్నుతున్నట్టుగా ఒక అమ్మాయి కాలు ఇందులో కనిపించడం మంచి ఇంపాక్ట్ కలిగించేలా కనిపిస్తుంది. బహుశా ఇదే విజయ్ కి కీర్తి సురేష్ రోల్ కి మొదటి పరిచయం సీన్ కావచ్చు. ఆమె చూస్తూ మైమరచిపోయినట్టుగా విజయ్ ఈ పోస్టర్ లో కనిపించడం గమనించవచ్చు.

మొత్తానికి మాత్రం మేకర్స్ విజయ్ ఫ్యాన్స్ కి తన పుట్టినరోజు కానుకగా సాలిడ్ ట్రీట్ ని అందించారు అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి క్రిస్టో జావియర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతుంది.

Exit mobile version