‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ‘రాకా’ అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ లో ఓ భారీ ఫైట్ ను ప్లాన్ చేశాడట అట్లీ. ఎగురుతున్న ఫ్లైట్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా గ్రాండ్ విజువల్స్ తో ఉంటుందని.. ముఖ్యంగా సినిమాలో వచ్చే మెయిన్ ట్విస్ట్ కి లీడ్ గా ఈ ఫైట్ ఉంటుందని.. పైగా సినిమా మొత్తంలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది.
కాగా భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
