మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్, దివ్యేందు శర్మ, రత్నవేలు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్లో అభిమానులు రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ చూసి హోరెత్తించారు.
కాగా, ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ప్రతి యాక్టర్‌కు మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని.. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు రావడానికి చాలా సమయం పట్టిందని.. అయితే, ఆర్ఆర్ఆర్ తర్వాత పెద్ది లాంటి మంచి చిత్రం తనకు వెంటనే లభించడం సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. బుచ్చిబాబు ఈ కథను తనకు చెప్పినప్పుడే ఇలాంటి సినిమాలు తరుచూ రావని తనకు అర్థమైందని.. అందుకే ఈ సినిమా తన కెరీర్లో ఓ స్పెషల్ చిత్రంగా నిలిచిపోతుందని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో పెద్ది పహల్వాన్ పాత్రలో రామ్ చరణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను జూన్ 4న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
