మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇక మరికొద్ది గంటల్లో ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ విస్ఫోటనం బయటకు రానుంది.
రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో.. బర్త్ డే కానుకగా ఎన్టీఆర్-నీల్ మూవీ నుంచి గ్లింప్స్‌ను నేటి రాత్రి (మే 19 రాత్రి) 11.52 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇక ఈ గ్లింప్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అది అభిమానుల ఊహకే వదిలేశారు మేకర్స్. అంత కాన్ఫిడెంట్‌గా ఈ గ్లింప్స్ కట్‌పై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లింప్స్‌లో ప్రశాంత్ నీల్ తొలుత తన ప్రపంచాన్ని పరిచయం చేసి, కొన్ని కీలక పాత్రలను పరిచయం చేస్తాడట. ఆ తర్వాత ఎన్టీఆర్ తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఆ ప్రపంచాన్ని ఎలా ఓవరటేక్ చేస్తాడనేది మనకు ఈ గ్లింప్స్‌లో చూపించబోతున్నారు.
ఈ గ్లింప్స్ ఏకంగా 4 నిమిషాలకు పైగా నిడివితో వస్తుండటంతో అసలు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఎలాంటి విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నారా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
