టాక్.. ‘విశ్వంభర’కి మరో పండుగ ఆప్షన్?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రాల్లో భారీ చిత్రం ‘విశ్వంభర’ కూడా ఒకటి. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే ఈ సినిమా ఓటిటి డీల్ పూర్తి కావడంతో ఈ సినిమా విడుదల డేట్ వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించాయి.

అయితే ఈ సినిమా డేట్ దాదాపు సంక్రాంతికే అని టాక్ కూడా మొదలైంది. కానీ అదే సమయంలో ఉన్న కాకా కూడా వెనక్కి తగ్గడం జరగదు అన్నట్టుగా మరో వెర్షన్ ఉంది. కానీ ఇక్కడ విశ్వంభర కి మరో ఆప్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ సంక్రాంతికి విశ్వంభర రానట్టయితే నెక్స్ట్ ఉగాది ఆప్షన్ ఉందట.

కానీ ఓటిటి డీల్ బట్టి వారు త్వరగా రిలీజ్ డేట్ నే కోరుకుంటారు. సో విశ్వంభర విడుదల ఎప్పుడు అనేది మేకర్స్ ఓ త్వరిత అనౌన్సమెంట్ చేయాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి, గౌర హరి సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version