‘పెద్ది’ కోసం తీవ్రంగా కష్టపడుతున్న రెహమాన్.. ఆశలన్నీ దీనిపైనే..!

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కలిసి ఈ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌కు కూడా సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇప్పటికే ఆయన కంపోజ్ చేసిన రెండు సాంగ్స్‌ను రిలీజ్ చేయగా, వాటికి సెన్సేషనల్ రెస్పాన్స్ లభించింది. చాలా కాలం తర్వాత ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి రెహమాన్ వర్క్ చేస్తుండటంతో ‘పెద్ది’పై అందరి చూపులు పడ్డాయి. ఇక ఈ సినిమా కోసం రెహమాన్ ఎంతో శ్రద్ధతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ బీజీఎం పూర్తి చేసి టీమ్‌కు అందించిన రెహమాన్, ప్రస్తుతం సెకండ్ హాఫ్‌పై దృష్టి పెట్టాడు. ముంబై ట్రైలర్ లాంచ్‌లో కూడా ఆయన ఈ సినిమాపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

‘పెద్ది’ సినిమాతో రెహమాన్ మరోసారి మ్యూజిక్ వరల్డ్‌లో తన సత్తా చాటేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. పెద్ది సినిమాకు ఆయన అందించే మ్యూజిక్ ప్రాణంగా నిలిస్తే, రెహమాన్ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే అని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాను జూన్ 4న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version