మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ దర్శకుడు జీతూ జోసెఫ్‌ల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం-3’ మే 21న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు ముందే రూ. 15 కోట్లకు పైగా (ఓవర్సీస్లో 1 మిలియన్ డాలర్లు) వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో ఇప్పటివరకు ‘ఎంపురాన్’(రూ.14 కోట్లు), ‘లియో’(రూ.12 కోట్లు) మాత్రమే మొదటి రోజు రూ.10 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించగా.. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ‘దృశ్యం 3’ కూడా తొలిరోజే రూ.10 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కేరళలోనే అడ్వాన్స్ సేల్స్ రూ.5 కోట్లు దాటాయట.
మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. గత భాగాల్లో నటించిన మీనా, అన్సిబా, ఎస్తేర్ అనిల్ తదితరులు ఈ పార్ట్‌లోనూ నటిస్తున్నారు. గత ఆరేడేళ్లలో జార్జ్‌కుట్టి కుటుంబంలో జరిగిన మార్పుల నేపథ్యంలో ఈ కథ సాగనుంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లు తక్కువగా ఉండటంతో ఇక్కడ బజ్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, మలయాళ మార్కెట్లో మాత్రం ‘దృశ్యం 3’ మొదటిరోజే రూ.10 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించే దిశగా దూసుకుపోతోంది.
