వడ్డీ కాసుల వాడ : ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్‌తో వస్తున్న మంచు మనోజ్..!

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ఆయన హీరోగా నటిస్తున్న సరికొత్త సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ మేకర్స్ ఒక గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘వడ్డీ కాసుల వాడ’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఖరారు చేశారు. మనోజ్ కెరీర్‌లో పెద్ద హిట్ అయిన ‘బిందాస్’ సినిమా తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఆయన నటిస్తున్న సినిమా ఇదే కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా కథ పూర్తిగా మిడిల్ క్లాస్ కుటుంబాల నేపథ్యంలో సాగుతుంది. ప్రస్తుతం సామాన్యులు ఎదుర్కొంటున్న ఈఎంఐలు, నెలసరి వాయిదాల కష్టాలను చాలా ఫన్నీగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. విడుదలైన కాన్సెప్ట్ వీడియోలో మనోజ్ ఆర్థిక ఇబ్బందులతో దేవుడికి మొరపెట్టుకోవడం చూస్తుంటే, అందరికీ కనెక్ట్ అయ్యేలా వింటేజ్ మనోజ్ స్టైల్ కామెడీ టైమింగ్‌తో ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది.

సినిమా టైటిల్ ‘వడ్డీ కాసుల వాడ’ అనేది చాలా క్యాచీగా, వినడానికి కొత్తగా ఉంది. ఈ చిత్రానికి తేజ్ ఉప్పలపాటి కథ, దర్శకత్వం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తుండగా.. కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర, దయా పన్నెం సహ-నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version