నాగబంధం : నార్త్‌లో గ్రాండ్ రిలీజ్ చేసేది వీరే..!

అభిషేక్ నామా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగబంధం’. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే విడుదలైన అద్భుతమైన టీజర్ మరియు పాటలతో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం జులై 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ తాజాగా వెలువడింది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘జీ స్టూడియోస్’ ఈ చిత్రం యొక్క నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా, అన్ని భాషల వర్షన్లను వారే ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బి.ఎస్.అవినాష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘నాగబంధం’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

Exit mobile version