‘మెగా 158’ షురూ.. ఆ ఇద్దరి మధ్య కీలక సీన్స్ తో?

Mega-158

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన కెరీర్ 158వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీతో లేటెస్ట్ గా గ్రాండ్ లెవెల్లో ఆరంభించిన సంగతి తెలిసిందే. మేకర్స్ భారీ పూజా కార్యక్రమంతో నిన్న ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. నిన్న పూజ జరుపుకున్న ఈ చిత్రం ఇవాళ్టి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేసేసుకుంది. అయితే ఈ షూట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.

ఈ చిత్రంలో ఛాంపియన్, రీసెంట్ గా యూత్ సినిమా బ్యూటీ అనశ్వర రంజన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె చిరుకి కూతురు పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్. మరి ఇవాళ చిరంజీవికి అలాగే అనశ్వర నడుమ కీలక సన్నివేశాలతో బాబీ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసినట్టు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక ముందు ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ షెడ్యూల్స్ సినిమా పరంగా కొనసాగనున్నాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు టాలీవుడ్ లో తమ మొదటి సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version