‘రామాయణ’ కొత్త పోస్టర్, ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్!

బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన భారీ విజువల్ ట్రీట్ చిత్రమే ‘రామాయణ’. ఇండియన్ సినిమా నుంచి వస్తున్న మొట్ట మొదటి ఐమ్యాక్స్ వెర్షన్ సినిమాగా తీసుకొస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఓయ్ లేటెస్ట్ అప్డేట్ ని మేకర్స్ ఇప్పుడు ఇచ్చారు.

రామాయణ నుంచి రేపు వినాయక చవితి కానుకగా ఉదయం ఏడున్నరకి సియా రామ్ పోస్టర్ ని విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. అలాగే దీనితోనే ఫస్ట్ సింగిల్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇక ఈ సాంగ్ ని ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేయగా డాక్టర్ కుమార్ విశ్వాస్ సాహిత్యం అందించారు.

అలాగే పాపులర్ సింగర్స్ శ్రేయా ఘోషల్ మరియు అర్జిత్ సింగ్ లు ఆలపించినట్టు తెలిపారు. ఇప్పుడు అభిమానులు రేపు రానున్న ఆ కొత్త పోస్టర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా, యష్ నిర్మాణం వహిస్తుండగా ఈ దీపావళి కానుకగా విడుదల కాబోతుంది.

Exit mobile version