ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ‘డ్రాగన్’ బ్యూటీ షాకింగ్ వీడియో!

ఇప్పుడున్న ఏఐ ప్రపంచంలో సోషల్ మీడియా వరకు ఏది నిజం ఏది అబద్దం అనేది ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. అయితే ఈ ఏఐ మూలాన సినీ ప్రముఖులు చాలావరకు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఈ ఏఐ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. తమపై పలు ఫేక్ ఫోటోలు, వీడియో లతో చాలామంది హీరోయిన్స్ పోరాటం చేస్తున్నారు.

ఇక ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా హోమ్లీ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా యాడ్ అయ్యిందా అనే టాక్ మొదలైంది. ఎందుకంటే లేటెస్ట్ గా హీరోయిన్ రుక్మిణీ వసంత్ పై ఓ షాకింగ్ వీడియో వైరల్ గా మారింది. ఇందులో ఆమె బికినీ ధరించిన దృశ్యాలు కనిపించడంతో చాలామంది ఇది నిజం అని నమ్మితే మరికొందరు ఇది పక్కా ఏఐతో చేసిందే అని భావిస్తున్నారు.

అయితే రుక్మిణి ఇప్పుడు వరకు ఈ తరహా ఎక్స్ పోజింగ్ ఏ సినిమాలో కూడా చేసింది లేదు. దీనితో సడెన్ గా ఈ రేంజ్ లో స్కిన్ షో అంటే ఎవరికైనా డౌట్ రాక మానదు. దీనితో ఈ వీడియో ఫేక్ అనే చాలామంది నమ్ముతున్నారు కానీ కన్నడ సినీ వర్గాల వారు మాత్రం నిజం అనే చెబుతున్నారు. మరి రీసెంట్ గానే ఎన్టీఆర్ డ్రాగన్ లో కనిపించిన ఈ బ్యూటీ నుంచి ఈ షాకింగ్ వీడియో మరింత వైరల్ గా మారింది.

Exit mobile version