‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి మరో క్రేజీ అప్డేట్.. సెకండ్ సింగిల్ ఎప్పుడంటే..?

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘గుర్తుందా’కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్‌గా మరో రొమాంటిక్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఈ సినిమాలోని ‘వదలనే’ అనే పాటను సెకండ్ సింగిల్ సాంగ్‌గ మే 25న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వారు రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్ లవర్స్ ఈ సినిమా పాటల కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సాయి రాజేష్ అందిస్తున్నారు. కాగా ఆయనతో కలిసి ఎస్‌కేఎన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి రాబోయే ఈ రెండో పాట ఎలా ఉంటుందో తెలియాలంటే మే 25 వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version