బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయని.. అందుకు తగ్గట్టు.. సెకండ్ హాఫ్ లో బాలయ్య పాత్ర పై ఓ ఫ్లాష్ బ్యాక్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.
థమన్ ఇప్పటికే, రెండు ట్యూన్స్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలయ్యను ఒక రాజుగా చూపించారు. అలాగే, నయనతారని ఒక మహారాణి పాత్రలో కనిపించనుందని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నట్టు గతంలో బాలయ్య – నయన్ కలిసి ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కాగా సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
