ఆయన చెప్పు తీసుకొని నన్ను కొట్టాడు – బండ్ల గణేష్

Bandla Ganesh

నిర్మాత – నటుడు బండ్ల గణేష్ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినీ ప్రస్థానం, జీవితంలో చూసిన ఒడిదుడుకుల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఇంతకీ బండ్ల గణేష్ ఏం మాట్లాడారు అంటే.. ‘ఒక పెద్ద మనిషి.. పేరు చెప్తే బాగోదు. అప్పట్లో సరదాగా ఆయన దగ్గరకి వెళ్లి కూర్చునే వాడ్ని. ఆ రోజు కూడా ‘సార్.. సార్’ అంటూ మామూలుగా చేతులు కట్టుకొని కూర్చొని ఉన్నా. సడెన్ గా ఆయన చెప్పు తీసుకొని నన్ను కొట్టాడు. నా తప్పు ఏమి లేకుండా ఆయన కొట్టాడు. భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నా, ఇది నిజం’ అని బండ్ల గణేష్ తెలిపాడు.

బండ్ల గణేష్ ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి ఆయన చాలా మంచోడే. అప్పట్లో నాకు చాలా సాయం కూడా చేశాడు. కానీ, ఆ రోజు ఆయన ఏదో పర్సనల్ టెన్షన్ లో ఉన్నారు. ఆ సమయంలో నేను కనిపించాను. అలా నన్ను కొట్టాడు. పాపం.. రెండో రోజు సారీ చెప్పాడు. కాకపోతే, ఆ ఘటన నాకు చాలా అవమానంగా అనిపించింది. డబ్బు లేదు అనే నన్ను అలా కొట్టాడు. ఏ రోజుకైనా ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా.. లేకపోతే నా పేరు గణేష్ కాదు’ అని అన్నాను. అలాగే సాధించాను’ అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version