సీఎం విజయ్ పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాను జూన్ 4న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు పెద్ది టీమ్.

ఈ ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ తమిళనాడు కొత్త సీఎం విజయ్ పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తమిళనాడు ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అందుకున్న సీఎం విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపాడు. ఆయన తన కెరీర్ పీక్స్‌లో ఉండగా ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వెళ్లారని చరణ్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని రామ్ చరణ్ అన్నాడు.

ఇక తమిళంలో కూడా పెద్ది సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version