ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : మే 31, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సుధ, జయంత్, లావణ్య సాహుకార తదితరులు
దర్శకత్వం : ఆంథోని మిట్టపల్లి
మూలకథ : యండమూరి వీరేంద్రనాథ్
సంగీతం : సుభాష్ ఆనంద్
ఛాయాగ్రహణం : వెంకట హనుమ కే. నరిసేటి
కూర్పు : అనీల్ కులకర్ణి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ లఘు చిత్రమే ‘నిశ్శబ్దం’. వీక్లీ సిరీస్ కథా సుధా నుంచి వచ్చిన ఈ లఘు చిత్రంలో ప్రముఖ నటి సుధ నటించారు. సో ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
రాఘవ (జయంత్ వడలి), సింధు (లావణ్య సాహుకార) ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. అయితే సింధు, రాఘవ కోసం తన ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చేస్తుంది. కానీ రాఘవ తనకి చెప్పకుండా ఆమెని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావడాన్ని తన తల్లి (సుధా) చూసి ఓర్వలేకపోతుంది. దీనితో తన కోడలిని కనీసం పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంది. దీనితో సింధుకి కూడా తన అత్తయ్య అంటే ద్వేషం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె తన అత్తయ్య విషయంలో ఏం చేసింది? ఆ తర్వాత ఆమె ఏం రియలైజ్ అయ్యింది అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రం గత ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాల్లా కాకుండా ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ తరహాలో కనిపించడం ఆసక్తిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ముగ్గురు లీడ్ నటీనటులు నడుమ నడిచే కథనం డీసెంట్ గా ఒక క్రైమ్ థ్రిల్లర్ తరహాలో వెళుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఇది పూర్తి క్రైమ్ థ్రిల్లర్ కూడా కాదు.
దాదాపు అందరి ఇళ్లలోని ఉండే జెనరల్ ఎమోషన్ నే తీసుకొని ఇందులో డీసెంట్ గా ప్రెజెంట్ చేశారు. సీనియర్ నటి సుధ తన అనుభవాన్ని చూపించి ఆకట్టుకున్నారు. అలాగే హీరోయిన్ లావణ్య క్యూట్ లుక్స్ లో కనిపించడమే కాకుండా మంచి నటన కూడా కనబరిచింది. వీరితో పాటుగా జయంత్ కూడా బాగా నటించాడు.
మైనస్ పాయింట్స్:
ఇది ఒకింత డీసెంట్ థ్రిల్లర్ అయినప్పటికీ కాన్సెప్ట్ అందరికీ తెలిసిన అంశమే కనుక కొంచెం రెగ్యులర్ గానే అనిపిస్తుంది. అంతే కాకుండా మొదటి కొన్ని నిమిషాల కథనం స్లోగా సాగుతుంది.
అలానే మరికొన్ని సీన్స్, చివరిలో పాజిటివ్ ట్విస్ట్ లాంటివి ఒకింత ముందే ఊహించదగిన వాటిలానే ఉంటాయి. అయితే మెడికల్ గా ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తో ఈ సినిమా మొదలవుతుంది కానీ దీనికి సింపుల్ ముగింపు ఇచ్చేయడం కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా వర్క్, సంగీతం, ఎడిటింగ్ లు డీసెంట్ గా ఉన్నాయి. యండమూరి వీరేంద్రనాథ్ మూల కథ ఇందులో బాగుంది. కొన్ని మన చుట్టూ జరిగే, కనిపించే పరిస్థితులు అంతగా ఎక్స్ పోజ్ కావు కానీ మనలోనే ఉంటాయి. అలాంటి ఓ పరిస్థితిని దర్శకుడు ఆంథోని మట్టిపల్లి నీట్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీ నేపథ్యంలో ఒక థ్రిల్లర్ తరహాలో డీసెంట్ గా మైంటైన్ చేశారు. కాకపోతే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా డిజైన్ చేసి ముగించి ఉంటే మరింత బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘నిశ్శబ్దం’ అనే లఘు చిత్రం తెలిసిన కాన్సెప్ట్ నే అయినప్పటికీ ఒక రేర్ గా వచ్చే అటెంప్ట్ అని చెప్పవచ్చు. ఫ్యామిలీ నేపథ్యంలోనే ఒక థ్రిల్లర్ తరహా ఎమోషన్స్ ని జోడించి నడిపించడం ఇందులో బాగుంది. అలానే నటీనటులు కూడా బాగా చేశారు. సో ఈ లఘు చిత్రాన్ని ఈటీవీ విన్ లో ట్రై చెయ్యొచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
