పవన్ ని మెప్పించిన ‘ధురంధర్’ దర్శకుడు.. కామెంట్స్ వైరల్!

pawan-and-aditya-dha

తన కొన్ని సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని సెట్ చేసిన దర్శకుడు ఆదిత్య ధర్ కోసం ఇప్పుడు ఇండియన్ ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రణ్వీర్ సింగ్ తో చేసిన ధురంధర్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసాయి.

అయితే ఆదిత్య ధర్ సినిమాలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. లేటెస్ట్ గా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నేషనల్ సినిమాలు ఏమన్నా చూసారా అనే ప్రశ్నకి తాను బారాముల్లా అలాగే ధురంధర్ సినిమాలు చూశానని ఆ సినిమాలు నాకు నచ్చాయి అని తెలిపారు.

అలాగే బారాముల్లా సినిమాలో చూపించిన టైం లైన్ సమయంలోనే తనకి కూడా శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో ఎదురైన అనుభవాలు కూడా తాను పంచుకోవడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే ధురంధర్ సినిమాలకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తే బారాముల్లా సినిమాకి తాను కథ, నిర్మాణం భాద్యతలు కూడా చేపట్టారు.

ఏ ఓటిటిలో ‘బారాముల్లా’ సినిమా?

వీక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతుంది. ఒరిజినల్ హిందీతో పాటుగా మన తెలుగు డబ్బింగ్ లో కూడా ఉంది. సో చూడాలి అనుకునేవారు తప్పకుండ చూడొచ్చు.

ఇలా ఆదిత్య ధర్ సినిమాలు కోసం పవన్ చెప్పిన కామెంట్స్ వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version